తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు
రిపోర్టర్: రమేష్
స్థలం: Vijayawada
మురసు తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల భద్రత కొరకు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్ లోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్ లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.