దిగ్భ్రాంతికరం: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. పోలీసుశాఖకు, ఆర్టీసీ సంస్థకు ఆయన అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు.