శంషాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ అఘాయిత్య యత్నంపై మహిళ ప్రతిఘటన
రిపోర్టర్: సురేష్
స్థలం: శంషాబాద్
హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ మహిళపై అఘాయిత్యానికి యత్నించినట్లు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు వెల్లడించారు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన మహిళ ప్రయాణిస్తుండగా, తోండుపల్లి టోల్‌ప్లాజా దాటిన తర్వాత నిందితుడు కొత్వాల్‌గూడ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి కారును మళ్లించి ఈ దుర్మాగానికి పాల్పడ్డాడు. బాధితురాలు చాకచక్యంగా కారు నుంచి దూకి ప్రతిఘటించడంతో, అరవై వేల రూపాయల నగదుతో పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.