హ్యాక్‌ఫెస్ట్ జాతీయ పోటీల్లో ప్రతిభ: ప్రథమ స్థానం సాధించిన ఆర్వీ విద్యార్థినులు
రిపోర్టర్: సతీష్
స్థలం: Bengaluru
బెంగళూరులోని సాయి విద్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన హ్యాక్‌ఫెస్ట్ జాతీయ స్థాయి పోటీల్లో ఆర్వీ విశ్వవిద్యాలయానికి చెందిన మేధా ఉమేష్, సాయి యశస్వి కంచర్ల విద్యార్థినులు గ్రీన్‌టెక్ విభాగంలో ప్రథమ స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్న కార్బన్ ఫుట్‌ప్రింట్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారని వారు పేర్కొన్నారు.