షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా నుంచి తప్పుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కింగ్' నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వైదొలిగినట్లు చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. బిజీ షెడ్యూల్ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే సినిమాకు సంబంధించిన థీమ్ ట్రాక్ను మాత్రం అనిరుధ్ అందించినట్లు తెలిసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.