చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు ఏపీ ప్రభుత్వం కొత్త కేంద్రాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలను (NRC) ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ కొత్త కేంద్రాల ద్వారా అదనంగా 175 పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం NRCల సంఖ్య 42కి, బెడ్ల సంఖ్య 515కి పెరగనుంది.