రక్తదానంతో ప్రాణాలు కాపాడుతున్న నర్సంపేట స్వచ్ఛంద దాతల బృందం

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట డివిజన్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు 162 మంది రక్తదాతలు మేమున్నాం పేరుతో వాట్సప్ గ్రూపుగా ఏర్పడ్డారు. ఇందులో పోలీసులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటూ రోగులకు సేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో రక్త గ్రూపును పోస్ట్ చేయగానే దాతలు స్పందించి ప్రాణాలు కాపాడుతున్నారు. గత పదిహేనేళ్లుగా ఈ సేవ నిరంతరం కొనసాగుతోందని గ్రూపు నిర్వాహకుడు పెందోట చంద్రమోహన్ వెల్లడించారు.