ఫ్లైదుబాయ్ విమాన ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్ స్మిత్ మచ్ఛర్

రిపోర్టర్: శివ స్థలం: ఢిల్లీ

దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించిన కోపైలట్ను ధైర్యసాహసాలతో అడ్డుకుని 174 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ను ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రశంసించారు. యూపీఎస్సీ శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఒక భారతీయుడు 9/11 తరహా పెను విషాదాన్ని అడ్డుకున్నారని వెల్లడించారు. పైలట్ స్మిత్ మచ్ఛర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు.