వర్ధన్నపేటలో భక్తిశ్రద్ధలతో ఘనంగా మహా అన్నప్రసాద వితరణ
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగడ్డ సెంటర్ వద్ద బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. బజరంగ్ యూత్ ప్రతి ఏటా అన్నదానం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.