ఇరాన్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ తో ఖతార్ అమీర్ అత్యవసర సంభాషణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: దోహా
ఇరాన్ దేశంతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఫోన్ లో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు పెరగకుండా నివారించాల్సిన అవసరం ఉందని ఇరువురు అగ్రనేతలు స్పష్టం చేసినట్లు ఖతార్ అధికారులు తెలిపారు. అలాగే ప్రాంతీయ సంఘర్షణల మధ్య శక్తి వనరుల రక్షణ, నౌకాయాన స్వేచ్ఛపై చర్చలు జరిపారు.