విశాఖపట్నంలో సీఎం చంద్రబాబుకు అచ్చెన్నాయుడు ఘన స్వాగతం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు స్థానిక నేతలు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని ఆయనకు సాదర స్వాగతం తెలిపారు.