ఎ.కొండూరులో రూ.94.97 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం
రిపోర్టర్: సురేష్
స్థలం: బాపట్ల
తిరువూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ పరిశ్రమలు, నివాస గృహాలు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఎ.కొండూరులో ఏపీ ట్రాన్స్‌కో రూ.94.97 కోట్లతో నిర్మించిన 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించినట్లు విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఈ నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నిరంతరం మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.