సత్య యోగిబాబు కాంబోలో గోల్డెన్ భాగ్యం చిత్రం షురూ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

తెలుగు, తమిళ ప్రముఖ హాస్య నటులు సత్య, యోగిబాబు ప్రధాన పాత్రల్లో గోల్డెన్ భాగ్యం పేరుతో ఓ క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రంగబలి ఫేమ్ పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్లో బిర్యానీ, ఇడ్లీ సాంబార్ అంశాలపై వీరిద్దరి సరదా సంభాషణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తోందని చిత్రబృందం పేర్కొంది.