పలాస తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓల సమావేశం అడ్హాక్ కమిటీ ఎన్నిక
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు డి. రాజేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వీఆర్ఓలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పలాస డివిజన్ అడ్హాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా సి.హెచ్. గోవింద్, జనరల్ సెక్రటరీగా సి.హెచ్. డిల్లీశ్వరరావు, ట్రెజరర్‌గా పి. అజయ్లతో పాటు ఇతర నూతన కార్యవర్గ సభ్యులను ఈ సమావేశంలో ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.