తమిళనాట మరో సంచలనం: అన్నాడీఎంకేలోకి ప్రముఖ నటుడు ధనుశ్ ఎంట్రీ
రిపోర్టర్: మహేష్
స్థలం: చెన్నై
తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటుడు ధనుశ్ రాజకీయ ప్రవేశంపై జోరుగా చర్చ జరుగుతోందని, ఆయన అన్నాడీఎంకే పార్టీలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నారని అన్నాడీఎంకే సీనియర్ నేతలు వెల్లడించారు. పార్టీ చీఫ్ పళనిస్వామి కుమారుడు మిథున్‌తో ధనుశ్ పలుమార్లు ప్రాథమిక చర్చలు జరిపారని సమాచారం. విజయ్ పార్టీకి పోటీగా యువతను ఆకర్షించేందుకు ధనుశ్ వంటి సినీ గ్లామర్‌ను వాడుకోవాలని అన్నాడీఎంకే నాయకత్వం గట్టి వ్యూహరచన చేస్తోందని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.