జన్నారంలో గీతాశ్రమంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
రిపోర్టర్: p.g. murthy
స్థలం: జన్నారం
జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకొని గీతాశ్రమ ప్రధాన పూజారి మౌన స్వామి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆశ్రమంలో భక్తి పాటలు, భజనలు ఆలపించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు.