అమెరికా చైనా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది
రిపోర్టర్: కిరణ్
స్థలం: అంతర్జాతీయం
అమెరికా మరియు చైనా దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించుతూ ఒక సంచలనాత్మక మెగా డీల్ కుదిరినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. పరస్పర దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించుకునేందుకు రెండు అగ్రరాజ్యాలు అంగీకరించాయని అధికారులు తెలిపారు. సుమారు ముప్పై బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై టారిఫ్లను సవరించనున్నారు. దాదాపు తొంబై శాతం ఉత్పత్తులపై పన్నులను తగ్గించడానికి ఒప్పందం కుదిరిందని, ఇది గ్లోబల్ సరఫరా గొలుసుకు భారీ ఊరటనిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.