తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్ లో ఈ నెల ఐదవ తేదీన పేరెంట్స్ మీటింగ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్ లో ఈ నెల ఐదవ తేదీన పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడంతో పాటు వారి అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన ఎస్ఏ-వన్ పరీక్షల ఫలితాలను తల్లిదండ్రులతో పంచుకోవాలని నిర్ణయించారు.