నకిలీ అడంగళ్లతో భూ పరిహారం స్వాహా చేస్తున్న అక్రమార్కులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో నకిలీ అడంగళ్లు సృష్టించి ప్రభుత్వ భూ పరిహారాన్ని కొల్లగొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చౌటపల్లి రిజర్వాయర్, బీపీసీఎల్, ఇండోసోల్ ప్రాజెక్టుల భూసేకరణలో రెవెన్యూ అధికారుల సహకారంతో కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోందని, నిజమైన రైతులు, సాగులో ఉన్న మత్స్యకారులకు అన్యాయం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. అక్రమార్కుల లీలలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.