పాఠ్యపుస్తకాలకు మించి విద్యనందించాలి: గవర్నర్ హరిభావు బాగ్డే

రిపోర్టర్: కిరణ్ స్థలం: Rajasthan

పాఠ్యపుస్తకాల పరిధిని దాటి విద్యార్థుల్లో అవగాహన, మేధో సామర్థ్యాన్ని పెంపొందించే విద్యను అందించాలని రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగ్డే స్పష్టం చేశారు. జైపూర్ లోని జగద్గురు రామాన్యాచార్య రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. సంస్కృతభాషను ప్రజల దైనందిన జీవితంలోకి తీసుకురావాలని, తద్వారా దాని ప్రాముఖ్యతను మరింత పెంచాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు.