పిడుగురాళ్లలో దారుణం: పోలీస్ స్టేషన్ ఎదుట మహిళను కత్తితో నరికిన నిందితుడు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. వేల్పూరు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి సుజాత ఆటో కోసం వేచి చూస్తున్న సమయంలో నిందితుడు బత్తుల గోవిందు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చినట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.