బియ్యం ధరలపై హెచ్చరిక: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి సమీక్ష
రిపోర్టర్: భాస్కర్
స్థలం: భువనగిరి
భువనగిరి జిల్లాలో బియ్యం లభ్యత, నిల్వలు మరియు ధరలపై హోల్సేల్, రిటైల్ వ్యాపారులతో అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆయన స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వ్యాపార ప్రాంగణంలో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.