విద్యార్థులు ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ పిలుపు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
నగరిలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వేణుగోపాల్ అధ్యక్షతన విద్యార్థులకు కెరీర్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యతో పాటు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. డిగ్రీ అనంతరం అందుబాటులో ఉన్న వివిధ ఉపాధి అవకాశాలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కౌటిల్య ఇన్స్టిట్యూషన్ వక్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే నరసింహ వర్మ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.