సింగరేణి రూ.760 కోట్ల నిధుల మళ్లింపుపై మద్దెల దినేష్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా సింగరేణి గనుల ద్వారా డీఎంఎఫ్టీకి రావాల్సిన రూ.760 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్లాయని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ నిలదీశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జోక్యంతో నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న 453 అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే చెల్లించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేసి ఆయన డిమాండ్ చేశారు.