స్మార్ట్ తాగునీటి ప్రాజెక్టుగా జేసీ నాగిరెడ్డి పథకం: లీకేజీలకు చెక్
రిపోర్టర్: మహేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లాలోని జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం ఆధునిక సాంకేతిక సాయంతో కొత్తరూపు సంతరించుకుందని అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిజ్ఞానంతో ఎక్కడికక్కడ సెన్సర్లు అమర్చి నీటి లీకేజీలను అరికడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలి స్మార్ట్ తాగునీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం నూట నలభై గ్రామాలకు నిరంతరం నీటి సరఫరా అందుతోందని స్పష్టం చేశారు.