తోపుచర్లలో పర్యావరణ పరిరక్షణకు అద్దం పట్టేలా మట్టి వినాయక నిమజ్జనం

రిపోర్టర్: శివ స్థలం: మధుగులపల్లి

మధుగులపల్లి మండలం తోపుచర్ల గ్రామంలో ముత్యాలమ్మ గుడి కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. నవరాత్రులు పూజలందుకున్న మట్టి వినాయకుడిని గ్రామంలోనే నీటిలో కరిగించి, ఆ మట్టితో పాటు తులసి, మారేడు మొక్కలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. వినూత్న రీతిలో పచ్చదనాన్ని పెంపొందించేలా చేపట్టిన ఈ కార్యక్రమంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో గడ్డం పురుషోత్తం రెడ్డి, పుల్లెంల సైదులు, ఆరూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.