తలసీమియా బాధితులకు కావలి రెడ్‌క్రాస్‌ భవన్‌ భరోసా

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

కావలిలోని రెడ్‌ క్రాస్‌ భవన్‌ తలసీమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ప్రాణదాతగా నిలుస్తోంది. ఇక్కడ 56 మంది బాధితులకు ఉచితంగా రక్తమార్పిడితో పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రాణాంతక ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారంగా రూ.40 లక్షల వ్యయంతో బోన్‌మ్యారో మార్పిడి శస్త్రచికిత్సలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే సగం మంది బాధితులను దాతలు దత్తత తీసుకోవడం విశేషం.