నగరంలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్: వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల భారం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

నగరంలో అక్టోబర్ నెలలో సగటు రోజువారీ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 3,894 మెగావాట్లకు చేరిందని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 600 మెగావాట్ల మేర అదనపు డిమాండ్ పెరిగినట్లు వెల్లడించారు. రాత్రివేళల్ లో తీవ్ర ఉక్కపోత, దోమల బెడద కారణంగా ఏసీలు, ఫ్యాన్ల వాడకం భారీగా పెరిగిందని పేర్కొన్నారు. దీనికి తోడు ప్రతి యూనిట్ పై 30 పైసల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఈఆర్సీ అనుమతించడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుందని అధికారులు స్పష్టం చేశారు.