కొత్త పార్టీ ఏర్పాటుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

రిపోర్టర్: నరేష్ స్థలం: అనంతపురం

మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను సీఎం అభ్యర్థిగా ఉండనని, యువతకు, సమర్థులైన ఇతర సామాజిక వర్గాల నాయకులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. టీడీపీకి ఓటు వేస్తే నారా లోకేష్, వైసీపీకి మద్దతిస్తే వైఎస్ జగన్ సీఎం అవుతారని, తన పార్టీ ద్వారా యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.