క్షణికావేశానికి లోనుకాకుండా విద్యార్థులు ఓర్పు సహనం పెంచుకోవాలి

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

అటామిక్ ఎనర్జీతో విద్యుత్ లేదా బాంబులు తయారు చేయవచ్చని, జీవితంలో సాధించేది సమాజ మేలు కోసమే ఉండాలని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ హితవు పలికారు. నిర్మాణం ఎప్పుడూ కష్టమని, విధ్వంసానికి మాత్రం క్షణం చాలునని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్షణికావేశాలకు పోకుండా ఓర్పు, సహనం అలవర్చుకోవాలని లోకేష్ సూచించారు.