సోషల్ మీడియా నిషేధం: ఆస్ట్రేలియా సుప్రీం కోర్టులో రెడ్ డిట్ వాదన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆస్ట్రేలియా

పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం రాజకీయ చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా అత్యున్నత ధర్మాసనంలో రెడ్ డిట్ తరఫు న్యాయవాది పెర్రీ హెర్జ్ ఫెల్డ్ వాదించారు. ఈ చట్టం అసంబద్ధంగా ఉందని, యువత గొంతును నొక్కేలా ఉందని పేర్కొన్నారు. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ కోర్టులో తొలిసారిగా న్యాయపోరాటం ప్రారంభమైనట్లు ఆయన స్పష్టం చేశారు.