వివేకా హత్యతో లబ్ధి పొందింది జగనేనని మంత్రి సత్యప్రసాద్ ధ్వజం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో అంతిమంగా లబ్ధి పొందింది వైఎస్ జగన్మోహన్రెడ్డియేనని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దస్తగిరి వాంగ్మూలం, సునీల్ యాదవ్ వెల్లడించిన వాస్తవాలు నేరుగా తాడేపల్లి ప్యాలెస్వైపే వేలెత్తి చూపుతున్నాయని తెలిపారు. ఈడీ, సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేయడంతోనే తాడేపల్లి పునాదులు కదులుతున్నాయని, ప్రజల దృష్టి మళ్లించేందుకే వైకాపా నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.