నాగార్జునసాగర్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం: ఉడాన్ పథకం కింద దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పల్నాడు

ఏపీలో విమానాశ్రయాల విస్తరణలో భాగంగా పల్నాడు జిల్లా నాగార్జునసాగర్లో కొత్త ఎయిర్పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఉడాన్ ఆరు పాయింట్ సున్నా పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినిచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తక్షణమే తుది దరఖాస్తును సమర్పించాలని ఏపీఏడీసీఎల్ ఎండీని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.