నెల్లూరు జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ విడుదల: నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్ తో పాటు బుచ్చి, ఆత్మకూరు మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే కోర్టు సమస్యలు మరియు వార్డుల పునర్విభజన పూర్తికాకపోవడంతో కావలి, గూడూరు మున్సిపాలిటీలతో పాటు అల్లూరు నగర పంచాయతీకి ఎన్నికలు వాయిదాపడినట్లు అధికారులు పేర్కొన్నారు.