గుంటూరు మేయర్ అభ్యర్థి ఎంపిక బాధ్యతలు కేంద్ర మంత్రి పెమ్మసానికి
రిపోర్టర్: అశోక్
స్థలం: గుంటూరు
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపిక మరియు ఎన్నికల సమన్వయ పూర్తి బాధ్యతలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు అప్పగించారు. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు అందరికీ ఆమోదయోగ్యమైన బలమైన అభ్యర్థిని ఖరారు చేసే దిశగా ఆయన కూటమి నేతలతో కలిసి కసరత్తు ముమ్మరం చేశారు.