పల్లిపాడు డైట్లో ముగిసిన పోటీలు: రాష్ట్రస్థాయికి విద్యార్థుల ఎంపిక
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి రోల్‌ప్లే మరియు జానపద నృత్య పోటీలు విజయవంతంగా ముగిశాయని డైట్ ప్రిన్సిపల్ డా.ఆర్.బాలాజీరావు తెలిపారు. జిల్లాలోని ఇరవై ఒక పాఠశాలలకు చెందిన సుమారు నూట యాభై మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు నోడల్ అధికారి వి.రాధారాణి పేర్కొన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు నవంబరులో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వారు వెల్లడించారు.