ఆదిలాబాద్ కాంగ్రెస్కు భారీ షాక్: బీఆర్ఎస్లోకి మాజీ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్నతో పాటు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.