ఎన్ఎఫ్ఎల్ స్టార్ ఆరోన్ రోడ్జర్స్ విరాళం: పోలీసు నిఘాపై తీవ్ర వివాదం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Jersey

అమెరికాలో ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ స్టార్ క్రీడాకారుడు ఆరోన్ రోడ్జర్స్ పోలీసు శాఖకు భారీగా విరాళం అందజేయడం తీవ్ర వివాదానికి దారితీసిందని ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ సీనియర్ పాలసీ అనలిస్ట్ మాథ్యూ గ్వారిగ్లియా వెల్లడించారు. న్యూజెర్సీలోని సెడార్ గ్రోవ్ పోలీసు విభాగానికి ఆయన ముప్ పై ఏడు వేల డాలర్లు సమకూర్చి ఆటోమేటిక్ లైసెన్స్ ప్లేట్ రీడర్ కెమెరాల కొనుగోలుకు సహకరించారు. అయితే ప్రజా సమాలోచనలు లేకుండా ధనవంతులు ఇటువంటి నిఘా వ్యవస్థలను ప్రభావితం చేయడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.