గువహతిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో హోమ్స్టే సీజ్

రిపోర్టర్: మహేష్ స్థలం: Guwahati

గౌహతి విశ్వవిద్యాలయ విద్యార్థిని నిమిషా ఠాకురియా మృతి కేసులో స్థానిక పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ధారపూర్ ప్రాంతంలోని రుద్రాస్ కిచెన్ హోమ్స్టేలో ఆమె అపస్మారక స్థితిలో లభించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సరైన గుర్తింపు పత్రాలు సేకరించకుండా గది కేటాయించినందుకు హోమ్స్టేను సీజ్ చేశామని, ఆమెతో ఉన్న ఆషిక్ అలీని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పశ్చిమ డీసీపీ బలిన్ దేయురి వెల్లడించారు.