కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ అంశాలపై ఇరువురు చర్చించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. ముఖ్యంగా గోదావరి కావేరి నదుల అనుసంధాన ప్రతిపాదనతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రితో కూడా సమావేశమైన ఆయన రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చించారు.