ఓటీటీకి రవితేజ ఇరుముడి మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన విజయం 'ఇరుముడి' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లతో అదరగొట్టిన ఈ ఎమోషనల్ డ్రామా నెట్ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.