అగ్నివీరులకు భారీ ఊరట: మరో రెండేళ్లపాటు సర్వీసు పొడిగింపునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

అగ్నిపథ్ పథకం కింద విధులు ముగించుకుని వెనుదిరగాల్సిన అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన వెసులుబాటు కల్పించింది. నిష్క్రమించాల్సిన అగ్నివీరులకు అదనంగా మరో రెండేళ్ల సర్వీసు పొడిగింపు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ద్వారా ఆసక్తిగల అగ్నివీరులు సాయుధ దళాల్ లో తమ సేవలను మరింత కాలం పొడిగించుకునే అవకాశం లభిస్తుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి స్పష్టం చేశారు.