తిరుమల బ్రహ్మోత్సవాలలో భక్తుల కోసం ప్రత్యేక ట్యాగ్ ల ఏర్పాటు

రిపోర్టర్: గోపి స్థలం: Tirumala

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలిపిరి టోల్ గేట్ మరియు జీఎస్ఎన్ డౌన్ ఘాట్ రోడ్ వద్ద మెట్ల మార్గంలో నడిచివచ్చే భక్తుల వెంట ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు మహిళా పోలీసులు వారి చేతులకు ట్యాగ్ లు కడుతున్నారు.