భారత్‌లో 80 శాతం మంది నాన్ వెజిటేరియన్లే: రాహుల్ గాంధీ

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

దిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు గాలా డిన్నర్‌లో పూర్తిగా శాకాహార వంటకాలు వడ్డించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్‌లో 80 శాతం మంది నాన్ వెజిటేరియన్లేనని, భారతీయ నాన్ వెజ్ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని పేర్కొన్నారు. తన సోదరి చేసే ఛోలే భటూరేలానే ఇవి ఉంటాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శాఖాహార విందుపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.