ప్రధాని మోదీకి స్వదేశీ సెక్యూరిటీ చిప్ వివరించిన పరిశోధకుడు ప్రదీప్ కుమార్ మోహంతీ

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

ఒడిశా గంజాం జిల్లా అస్కాకు చెందిన యువ పరిశోధకుడు ప్రదీప్ కుమార్ మోహంతీ దిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026లో ఎన్ఐటీ రూర్కెలా అభివృద్ధి చేసిన స్వదేశీ సెక్యూరిటీ సెమీకండక్టర్ చిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా వివరించారు. ఈ చిప్ డిజైన్, పనితీరును ప్రధానికి వివరిస్తూ తమ పరిశోధనల ఫలితాలను ఆయనతో పంచుకోవడం ఎంతో గర్వకారణమని మోహంతీ తెలిపారు.