రాప్తాడు విద్యార్థినిపై దాడి ఘటన: కూటమి సర్కార్ పై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనంతపురం

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన మాదకద్రవ్యాల వినియోగం వల్లే అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థిని గోపికపై దాడి జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో బాధిత బాలిక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బాధితులకు యాభై లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, లేదంటే తమ ప్రభుత్వంలో అందిస్తామని జగన్ స్పష్టం చేశారు.