అమరావతి అభివృద్ధికి సీఆర్డీఏ కీలక ప్రణాళికలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

అమరావతి రాజధాని అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సీఆర్డీఏ కీలక చర్యలు చేపట్టింది. బాహ్య, అంతర వలయ రహదారుల మధ్య అభివృద్ధి కారిడార్ల ఏర్పాటుకు భూసమీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. 26 గ్రిడ్ రోడ్లను ఐఆర్‌ఆర్‌తో అనుసంధానించడంతో పాటు 13 రంగాల పరిశ్రమలు, లాజిస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.