ఆంధ్రప్రదేశ్ లో దీపం రెండు పథకం రాయితీ జమ విధానంలో కీలక మార్పులు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం రెండు పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాయితీ సొమ్ము జమ అయ్యే ప్రక్రియలో పౌరసరఫరాల, ఆర్థిక శాఖ అధికారులు కీలక మార్పులు చేస్తున్నారు. ఇకపై ఏ నెలలో సిలిండర్ డెలివరీ తీసుకుంటే ఆ తర్వాతి నెలలో ఒక నిర్ణీత తేదీన నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి క్యాష్ బ్యాక్ రూపంలో రాయితీ సొమ్ము జమ చేయనున్నారు.