పాలేరు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఖమ్మం
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఎలాంటి పెండింగ్ లేకుండా సత్వరమే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఖమ్మం (Collector Khammam) ఆదేశించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దుపల్లిలో జరుగుతున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.