అమరావతి ఔటర్ రింగ్రోడ్డు డిజైన్ మార్పు: భారీగా తగ్గిన ప్రాజెక్టు వ్యయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Amaravati

అమరావతి ఔటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తగ్గించేలా అధికారులు కీలక మార్పులు చేశారని నేషనల్ హైవేస్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. గతంలో ప్రతిపాదించిన పందొమ్మిది ఇంటర్ఛేంజ్లను పదిహేడుకు కుదించి, సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని మార్చడంతో ప్రాజెక్టు ఖర్చు ముై వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్లకు తగ్గిపోయింది. ఈ నూతన రహదారి మార్గంలో వాహనాల రాకపోకలు మరింత సులువుగా సాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.